ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అలాంటిది కాదు.. క్లారిటీ ఇచ్చిన టీమ్
By సుభాష్
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఫిక్షన్ కథాంశంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో కొమురంభీమ్‌గా, రాచ్ చరణ్ అల్లురి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే ఈ చిత్ర బృందం నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. అందులో ఇద్దరు హీరోల చేతులు కలిపినట్లుగా చూపించారు. ఈ నేపథ్యంలో సినిమా స్టోరీ గురించి ఓ నెటిజర్ కామెంట్ చేశారు.
ఈ పోస్టర్‌ని చూస్తుంటే కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు ఇద్దరు కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాడుతారని తెలుస్తోంది అని ట్వీట్ చేశారు. నెటిజర్ చేసిన కామెంట్‌కు ఆర్‌ఆర్‌ఆర్ బృందం స్పందించింది. ఆ ఇద్దరు కలుస్తారు. అవి వారి చేతులే. కానీ ఈ మూవీలో వారిద్దరు స్వాతంత్ర్యం కోసం పోరాడరు. ఇది దేశ భక్తి చిత్రం కాదు. కేవలం కల్పిత కథ మాత్రమే అని కామెంట్ పెట్టారు. కాగా, గతేడాది ఈ సినిమా గురించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమౌలి సినిమా కథను వివరించారు. అల్లూరి కొన్ని రోజులు ఇంటి నుంచి దూరంగా వెళ్లారు.
కొమురంభీమ్ కూడా కొన్ని రోజులు ఇంటి నుంచి వెళ్లారు. అప్పుడు వారు ఎక్కడికి వెళ్లారన్నది ఎవ్వరికీ తెలియదు. మళ్లీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వారిద్దరు ఆలోచన విధానాలు ఒకే విధంగా ఉండేవి అని తెలుసుకున్నా. అప్పుడే ఆర్‌ఆర్‌ఆర్ ఐడియా వచ్చింది. ఇది ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోంది. అని రాజమౌళి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.