తుపాకితో కాల్చుకుని ఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్య

By సుభాష్  Published on  31 Jan 2020 7:32 AM GMT
తుపాకితో కాల్చుకుని ఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్య

విధులు నిర్వహిస్తున్న రైల్వే ఆర్పీఎఫ్‌ జవాను ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. ముంబాయి నుంచి చెన్నై వెళ్తున్న మెయిల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌ఎస్‌ పన్వర్‌ గురువారం అర్ధరాత్రి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. కడప జిల్లా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు.

విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జవానును చికిత్స నిమిత్తం నందలూరు రైల్వే స్టేషన్‌కు తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక బ్బందులు ఉన్నాయా..? లేక విధుల్లో ఏమైన ఒత్తిళ్లు ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it