'నాసా'.. మీతో మాకు ప‌నుంది... వారిద్ద‌రి సిక్సులు కూడా క‌నిపెట్టాలి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Dec 2019 12:11 PM GMT
నాసా.. మీతో మాకు ప‌నుంది... వారిద్ద‌రి సిక్సులు కూడా క‌నిపెట్టాలి..!

ఇంత‌వ‌ర‌కు ఒక్క‌ ఐపీఎల్‌ టైటిల్ కూడా సాధించని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారైనా టైటిల్‌ను గెలవాలని చూస్తుంది. ఇందుకు సంబందించి ఆర్సీబీ యాజ‌మాన్యం ఐదు నెల‌లు ముందుగానే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంది. అయితే.. ఓ ఫ‌న్నీ ట్వీట్‌తో ఆర్సీబీ త‌న అభిమానుల‌ను అల‌రించింది. అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా.. చంద్రయాన్‌-2 'విక్రమ్‌ ల్యాండర్‌' ఆచూకీని కనుగొన్న విష‌యం తెలిసిందే.

ఆర్సీబీ యాజ‌మాన్యం త‌న ట్వీట్‌లో.. ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలు వచ్చే ఐపీఎల్‌లో కొట్టే సిక్సర్లను కనిపెట్టడానికి నాసా సాయం అవసరం ఉంటుంది అని ఓ ఫ‌న్నీ ఫోస్టు చేసింది. ‘నాసా టీమ్.. విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని కనిపెట్టిందా.. అయితే మాకు మీ అవసరం కూడా ఉంది. ఏబీ డివిలియర్స్‌-విరాట్‌ కోహ్లీల‌ బ్యాట్‌ల నుంచే వచ్చే సిక్సర్లను కూడా కనిపెట్టడానికి సాయం చేయండి’ అంటూ ఆర్సీబీ నాసాను కోరుతూ విన్నూత్నంగా ట్వీట్‌ చేసింది.

చంద్రుడి దక్షిణ ధృవంలో కోల్పోయిన విక్రమ్ లాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. నాసాకు చెందిన లూనార్ రీకానైసాన్స్ ఆర్బిటర్ చంద్రుని ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపైకి పంపితే అది కుప్పకూలిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాంతంలోఇన్నాళ్లు చీకటి గా ఉండటం వల్ల ల్యాండర్ జాడను కనిపెట్టలేక పోయారు. అయితే ఇప్పుడు ఎల్ ఆర్ వో చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా ఫోటో తీసి పంపింది. విక్రమ్ శకలాలు దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రెండు డజన్ల ప్రదేశాలలో పడ్డట్టు గుర్తించింది. షణ్ముగ సుబ్రమణియన్ అనే వ్యక్తి విక్రమ్ కు సంబంధించిన తొలి శకలాన్ని కనుగొన్నట్లు నాసా ప్రకటించింది.



Next Story