సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న పూరి హీరో..? ఇంత‌కీ ఎవ‌రా హీరో..?

By Medi Samrat  Published on  12 Oct 2019 7:22 AM GMT
సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న పూరి హీరో..? ఇంత‌కీ ఎవ‌రా హీరో..?

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న పూరి హీరో అన‌గానే... ఎవ‌రా హీరో అనుకుంటున్నారా..? 'రోగ్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతో న‌టుడుగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ హీరో ఇషాన్. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'రోగ్' సినిమాతో ఇషాన్ తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించాడు. సి. ఆర్. మ‌నోహ‌ర్ నిర్మించిన ఈ సినిమా యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యింది.

ఇషాన్, మ‌న్నారా చోప్రా జంట‌గా న‌టించిన 'రోగ్' సినిమా మార్చి 31న 2017లో రిలీజైంది. రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇప్పుడు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసారు. ఒక్క రోజులోనే ఈ సినిమాకి 4 మిలియ‌న్ వ్యూస్ రావ‌డం విశేషం. ఈ విధంగా ఇషాన్ డిజిటల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ప్ర‌స్తుతం 'రెమో' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ప‌వ‌న్ వడయార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' డైరెక్ట‌ర్ విజ‌య్ కుమార్ కొండాతో ఓ సినిమా చేస్తున్నాడు. మ‌రి.. ఈ రెండు సినిమాల‌తో ఇషాన్ స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

Next Story
Share it