అవకాశం వస్తే ఆ ఇద్దరు హీరోలతో నటిస్తా: రోజా
By సుభాష్ Published on 23 Aug 2020 8:25 AM ISTప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓ వైపు
ఎమ్మెల్యేగా, మరో వైపు ఏపీఐఐసీ చైర్ పర్సన్, అలాగే బుల్లితెరపై పలు షోలు నిర్వహిస్తున్నారు.
అయితే సినిమాలకు దూరమై చాలా ఏళ్లు గడిచిపోతోంది. చివరిసారిగా రోజా 2015లో వచ్చిన
'ఎన్ వాళి తాని వాళి' అనే తమిళ సినిమాలో కనిపించారు. ఇక ఆమెను మళ్లీ వెండితెరపై
తీసుకువచ్చేందుకు చాలా మంది దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రోజా పూర్తి
సమయం రాజకీయాలకే కేటాయిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఓ టీవీ ఛానల్‌లో జరిగిన వేడుకలో మీరు మళ్లీ వెండితెరపై చిరంజీవితో కలిసి
నటిస్తారా..? అని యాంకర్ అడుగగా, అందకు రోజా స్పందిస్తూ.. ప్రస్తుతం తాను సినిమాలకు
దూరంగా ఉన్నానని, కానీ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని
చెప్పుకొచ్చారు. చిరంజీవి సినిమాల్లో తనకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. అలాగే చిరంజీవి నటించిన బిగ్‌బాస్ సినిమాలో మావా..మావా.. పాటకు ఎంతో పేరు వచ్చిందని, అంతేకాండా ముఠామేస్త్రీ సినిమా కూడా మంచి పేరు తీసుకువచ్చిందన్నారు.