ముంబై: బంగ్లాదేశ్‌తో జరగనున్నటెస్ట్, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే..టెస్ట్ సిరీస్ కు కోహ్లీ వచ్చి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటారు.

దేశవాళీ క్రికెట్‌కు సెలక్షన్ కమిటీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. సంజూశాంసన్‌ను నాలుగేళ్ల తరువాత బోర్డ్ పిలిచింది. 2015లో జింబాబ్వే సిరీస్‌లో పాల్గొన్నాడు. ముంబై ఆల్ రౌండర్ శివన్ ధూబేను కూడా తీసుకున్నారు. ముంబై మీడియం పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు టీ20లో అవకాశం ఇచ్చారు.

టీ20 జట్టు : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌, కృనాల్‌ పాండ్యా, చాహల్‌, రాహుల్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, శివమ్‌ దూబే, శార్దుల్‌ ఠాకూర్‌

టెస్టు జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, చటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్దిమాన్‌ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మాన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.