రాంచీ: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్నాడు. డబుల్ సెంచరీ బాదాడు. ద్విశతకాన్ని సిక్స్‌ కొట్టి పూర్తి చేసుకున్నాడు. 255 బంతుల్లో 212 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. రోహిత్ డబుల్ సెంచరీలో 28 ఫోర్లు, ఆరు సిక్స్‌లున్నాయి. రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ అవుటయ్యాడు. అంతకు ముందు రహానే సెంచరీ బాదాడు. 192 బంతుల్లో 115 పరుగులు చేశాడు. టీమిండియా స్కోర్‌ 300 దాటాక రాహాన్‌ పెవిలియన్ చేరుకున్నాడు.

రోహిత్ శర్మ ఈ సిరీస్‌లోనే ఓపెనర్ గా బరిలోకి దిగాడు. దిగిదిగడంతోనే విశాఖ టెస్ట్‌లో రెండు సెంచరీలు సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు కొట్టాడు. ఇక…వన్డేల్లోనైతే రోహిత్ శర్మ మూడు ద్విశతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 264, 209, 208 పరుగులతో రోహిత్ కళ్లు తిరిగే ద్విశతకాలను వన్డేల్లో సాధించాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.