ముఖ్యాంశాలు

  • తొంద‌ర‌పాటులో క్యాచ్ మిస్
  • లంచ్ విరామంలో ప్రాక్టిస్
  • లంచ్ త‌ర్వాత అదే త‌ర‌హా క్యాచ్ ప‌ట్టేశాడు

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భాగంగా శనివారం మూడో రోజు ఆటలో ఓ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఎదురీదుతున్న బంగ్లా జ‌ట్టులోని ప్ర‌ధాన ఆట‌గాడు ముష్ఫికర్‌ రహీమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ వదిలేశాడు. షమీ బౌలింగ్‌లో బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి నేరుగా సెకండ్ స్లిప్‌లో ఉన్న‌ రోహిత్‌ నేలపాలు చేశాడు.

దీంతో ఫీల్డ్‌లోనే అసహనం వ్యక్తం చేసిన రోహిత్‌.. క్యాచ్‌ను ఎందుకు వదిలేశాననే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. లంచ్‌ విరామంలో అదే తరహా స్లిప్‌ క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేశాడు. ప్రాక్టీస్‌ చేసిన అనంత‌రం రోహిత్ ఫీల్డ్‌లోకి దిగాడు. లంచ్‌ తర్వాత షమీ వేసిన ఓవర్‌లో మహ్మదుల్లా ఇచ్చిన అదే త‌రహా క్యాచ్‌ను రోహిత్‌ ఏమాత్రం తడబాటు లేకుండా ఒడిసి ప‌ట్టేసుకున్నాడు. ఇదంతా గ‌మ‌నించిన అభిమానులు రోహిత్ ను పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోయారు. రోహిత్.. రోహిత్ అంటూ హ‌ర్షద్వానాలు వ్య‌క్తంచేశారు.

అయితే.. దీనికి సంబంధించి వీడియోను బీసీసీఐ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇదిలావుంటే.. బంగ్లాదేశ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రోహిత్ చేతిలో లైఫ్‌ లభించిన ముష్పీక‌ర్ రహీమ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి :

Rohit Drops, then CatchesShami-Rohit combination. No mistake from Rohit Sharma the 2nd time.https://www.bcci.tv/videos/137979/rohit-drops-then-catches

Posted by Indian Cricket Team on Friday, November 15, 2019

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

5 comments on "‘వారెవ్వా.. రోహిత్’.. ఇందుకే క‌దా నిన్ను మెచ్చుకునేది.!"

Comments are closed.