ముఖ్యాంశాలు

  • ఇండోర్ లో దుమ్మరేపిన మయాంక్
  • డబుల్ సెంచరీ సాధించిన మయాంక్
  • బ్రాడ్ మన్, రోయి రికార్డ్ ల బద్దలు కొట్టిన మయాంక్

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి రోజు రెండో టెస్ట్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ మయాంక్‌ చెలరేగిపోయాడు. డబుల్ సెంచరీ సాధించాడు. 330 బంతుల్లో 243 పరుగులు చేశాడు, 243 పరుగుల్లో 28 ఫోర్లు, 8 సిక్స్‌లున్నాయి. అగర్వాల్ సెంచరీతో భారత్ 282 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారీ షాట్‌కు ప్రయత్నించి మయాంక్ అవుటయ్యాడు. రవీంద్ర జడేజా , వృద్ధిమాన్ సాహూ క్రీజ్‌లో ఉన్నారు. జడేజా 46 పరుగులు ,సాహూ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బ్రాడ్ మన్‌, లారెన్స్ రోయి రికార్డ్‌లను మయాంక్‌ తిరగరాశాడు. బ్రాడ్ మన్ 13, రోయి 14 ఇన్నింగ్స్‌ల్లో ద్విశతకాలు సాధించగా..మయాంక్ 12 ఇన్నింగ్స్‌ల్లో ద్విశతకాలు సాధించాడు. భారత్ తరపున కూడా రెండు డబుల్ సెంచరీలు చేసిన ఐదో ఓపెనర్‌గా మయాంక్ నిలిచాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.