సోష‌ల్‌మీడియాలో పిచ్చెక్కిస్తున్న 'రోహిత్' ల‌వ్ మెసేజ్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Dec 2019 3:09 PM GMT
సోష‌ల్‌మీడియాలో పిచ్చెక్కిస్తున్న రోహిత్ ల‌వ్ మెసేజ్‌..!

టీమిండియా క్రికెట‌ర్‌ రోహిత్‌శర్మ జీవితంలో ఈ రోజు చాలా ముఖ్య‌మైన రోజు. తన జీవిత భాగ‌స్వామిని వివాహామాడిన రోజు. అందుకే సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌ రితిక సజ్దేకు ఓ సందేశం పంపాడు. ఇప్పుడు ఆ సందేశం వైరల్ అవుతోంది. వీరి వివాహం జ‌రిగి నేటికి నాలుగేళ్లు పూర్తయ్యింది.ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ రోహిత్.. తన భార్య రితిక సజ్దే నుదుటిపై ముద్దుపెడుతున్న ఫొటోను ట్వీట్ చేశాడు. అంతేకాకుండా.. ‘నీవు లేని జీవితాన్ని ఊహించుకోలేను. ఇంతకంటే గొప్పది ఇంకేమి ఉండదు.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ లవ్ ఎమోజీలతో త‌న స‌తీమ‌ణికి టాగ్ చేశాడు.

ఇదిలావుంటే.. ఆరేళ్ల డేటింగ్ తర్వాత రోహిత్‌శర్మ-రితిక సజ్దేలు 2015లో పెళ్లాడారు. వీరిద్ద‌రికి దాదాపు ఏడాది వయసున్న పాప స‌మైరా శ‌ర్మ మొద‌టి సంతానం. రోహిత్ ట్వీట్ ప‌ట్ల అత‌ని అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. వెడ్డింగ్ డే విషేష్ చెప్తూ.. ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. నిజ‌మైన ప్రేమ‌కు నిర్వ‌చ‌నం మీరే అంటూ.. కామెంట్ల‌తో త‌మ అభిమాన క్రికెట‌ర్ కు ట్యాగ్ చేస్తున్నారు.

Next Story
Share it