నవ్వులు పూయిస్తున్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ట్వీట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 1:18 PM GMT
నవ్వులు పూయిస్తున్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ట్వీట్

భారత క్రికెటర్లలో ఓపెనర్‌ రోహిత్ శర్మ, స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఎంత క్లోజో అందరికి తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు వేసుకున్న సెటైర్స్‌ అభిమానులకు సుపరిచితమే. ఇక తాజాగా చహల్‌ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ యూట్యూబర్‌, డాక్టర్‌, కొరియోగ్రాఫర్‌ ధనుశ్రీ వర్మతో శనివారం నిశ్చితార్థం జరిగినట్లు శనివారం సోషల్ మీడియాలో ప్రకటించాడు. చహల్‌ పోస్టును చూసిన అభిమానులు, ఆటగాళ్ల ఒక్క సారిగా అవాక్కైనా.. అభినందలు తెలిపారు.

టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనదైన శైలిలో రోహిత్‌ శర్మకు విషెష్‌ చెప్పాడు. ఓ ఫన్నీ మీమ్‌ను షేర్‌ చేశాడు. ‘భాయ్ నిశ్చితార్థం చేసుకున్నందుకు కంగ్రాట్స్.. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2050లో యువ క్రికెటర్‌తో చాహల్‌ అంటూ ఉన్న ఆ మీమ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ ఆఫ్‌ బెంగళూరు తరుపున చహల్ ఆడుతున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.Next Story