రేపు లేనట్లు.. మీ ప్రియమైన వారిని ప్రేమించండి

By Newsmeter.Network  Published on  15 Feb 2020 7:08 AM GMT
రేపు లేనట్లు.. మీ ప్రియమైన వారిని ప్రేమించండి

హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ.. పరుగుల వరద ఎలా పారిస్తాడో.. అలాగే తన కుటుంబాన్ని ప్రేమిస్తాడు. వాలెంటైన్స్‌ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపాడు ఈ భారత ఓపెనర్‌. ‘ అందరికి వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు.. రేపు లేనట్లు.. ఇష్టమైన వారికి ప్రేమను పంచండి’అని క్యాప్షన్‌ పెట్టి భార్య రితికాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో గాయపడిన హిట్‌మ్యాన్ ప్రస్తుతం రెస్ట్‌ తీసుకుంటున్నాడు.

ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హిట్‌మ్యాన్‌ సహచరుడు శిఖర్‌ ధానవ్‌ కూడా శుభాకాంక్షలు చెప్పాడు. వాలెటంటైన్స్ డే సందర్భంగా ధావన్‌ ఓ ఫోటోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. భార్య ఆయేషాతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ధావన్‌.. ‘నా ఒక్కగానొక్క సతీమణి, స్నేహితురాలితో ప్రేమికుల దినోత్సవ వేడుకలు’అని క్యాప్షన్‌ పెట్టాడు.

ఇంకేముంది నెటీజన్లు కూడా ఈ జంటకు వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ధావన్‌ ప్రాతినిధ్యం వహించే ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ఈ ఆటగాడికి శుభాకాంక్షలు చెప్పింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. గాయపడిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కివీస్‌ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు ఈ లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌..

Next Story
Share it