ఆ రన్‌తో.. దిగ్గజాల సరసన రోహిత్

By Newsmeter.Network  Published on  2 Feb 2020 9:22 AM GMT
ఆ రన్‌తో.. దిగ్గజాల సరసన రోహిత్

హిట్ మ్యాన్‌ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు అంత‌ర్జాతీయ క్రికెట్‌ లో అన్ని ఫార్మాట్లలో కలిసి 14వేల ప‌రుగుల‌ను పూర్తి చేసుకున్నాడు. మౌంట్ మాంగ‌నీలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదో టీ20లో 31 ప‌రుగుల మార్కును చేరుకోగానే రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. 14వేల ప‌రుగుల్ని పూర్తి చేసిన ఎనిమిదో భార‌త ప్లేయ‌ర్‌గా రోహిత్ అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. గ‌తంలో భార‌త్ త‌ర‌పున ఈ మైలురాయిని మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఎంఎస్ ధోనీ, సౌర‌వ్ గంగూలీ, రాహుల్ ద్ర‌విడ్‌, విరాట్ కోహ్లీ, స‌చిన్ టెండూల్క‌ర్ సాధించారు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ స్టాండిన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషం. కాగా ఈమ్యాచ్ లో రోహిత్‌ శర్మ(60 ‌; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రిటైర్డ్‌ హర్ట్ గా వెనుదిరిగాడు. రోహిత్ పాటు కేఎల్‌ రాహుల్‌(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

Next Story