టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంక్రాంతి కానుకగా రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్న విషయం తెలిసిందే. మొదటి సింగిల్ ‘మైండ్ బ్లాక్’ మాస్ నంబర్ కి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సాయంత్రం ‘సూర్యుడివో చంద్రుడివో’ సెకండ్ సింగిల్ ను విడుదల చేయనున్నారు.

అయితే ఈ రోజు షూటింగ్‌ జరుపుకుంటున్న మూడు వేరువేరు సినిమాల పాటల గురించి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈరోజు వెల్లడించారు దేవిశ్రీ ప్రసాద్. అందులో సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరునీకెవ్వరు’ నుండి ఒక డాన్స్ నంబర్, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ మూవీ నుండి ఒక రొమాంటిక్ మెలోడీ, కీర్తి సురేష్ తదుపరి చిత్రం నుండి ప్రత్యేకమైన కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్ ఈ రోజు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ రీ రికార్డింగ్ పనుల్లో బిజీ గా ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్. జనవరి 11, 2020 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతున్న సరిలేరు నీకెవ్వరు లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్టైనర్ కి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.