ఎస్సైపై హత్యాప్రయత్నం చేసిన దోపిడి ముఠా అరెస్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2019 9:19 AM GMT
ఎస్సైపై హత్యాప్రయత్నం చేసిన దోపిడి ముఠా అరెస్ట్

సైబరాబాద్ : వారం రోజుల క్రితం దొంగల ముఠా.. రాత్రిపూట‌ విధుల్లో ఉన్న ఎస్సైపై హత్యాప్రయత్నం చేసి పారిపోయిన సంగ‌తి తెలిసింది. అయితే ఆ దొంగ‌ల‌ను ఈ రోజు పేట్ బషీర్ బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు మహారాష్ట్రకు చెందిన‌ కరుడుకట్టిన దొంగ‌ల‌ ముఠాగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వేట కొన‌సాగించారు. చివ‌రికి ఈ రోజు ప‌ట్టుకున్నారు.

అయితే.. ఈ దోపిడి ముఠా దూలపల్లిలో ఉన్న జ్యూవెలరీ షాప్‌ని దోచుకోవడానికి వచ్చారు. రోడ్డు పక్కనే అనుమాస్పదంగా వ్యాను ఆగి ఉండటంతో పోలీసుల కంటపడింది దోపిడి ముఠా. పోలీసులు వెంబడించడంతో దూలపల్లిలో పారెస్ట్‌లో వ్యాను వదిలేసి పారిపోయారు. గతంలో అనేక దోపిడిలు చేసిన ఈ కరుడుకట్టిన గ్యాంగే ఎస్సైపై హత్యప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురుని అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Next Story