చోరీ చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ.. చివరకు ఏమైందంటే..

By సుభాష్  Published on  28 Feb 2020 4:26 PM GMT
చోరీ చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ.. చివరకు ఏమైందంటే..

ఓ ఇంట్లో దొంగ చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. దొంగతనానికి వచ్చిన ఇంట్లో దోచుకునేందుకు ప్రయత్నించగా, ఇంట్లో ఓ అల్మారాలో షాంపైన్ చూసి వెంటనే తాగేశాడు. దీంతో ఫుల్లుగా కిక్కెక్కి అలాగే నిద్రపోయాడు. చివరకు ఇంటి యజమానికి చిక్కి పోలీసులకు సమాచారం అందించడంతో కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.

కర్ణాటకలోని ఉల్లాస్‌ జంక్షన్‌లో నివసిస్తున్న సుదర్శన్‌ అనే వ్యక్తి ఉదయం నిద్రలేచి హాల్లోకి వచ్చాడు. ఇంటి పైకప్పు పెంపెకులు తొలగించి ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తన ఇంట్లో దొంగలు పడ్డారని ఆందళనతో సుదర్శన్‌ బెడ్‌ రూమ్‌లోకి వెళ్తుండగా, హాల్లోని సోఫాలో ఎవరు ఉన్నట్లు గుర్తించాడు. దగ్గరకు వెళ్లి చూస్తే చేతిలో తాళాల గుత్తి పట్టుకుని గాఢంగా నిద్రిస్తున్నాడు ఓ వ్యక్తి. దీంతో సుదర్శన్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు దొంగను నిద్రలేని అదుపులోకి తీసుకున్నారు. ఇక దొంగను అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. కాగా, ఇటీవల ముంబాయిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Next Story
Share it