ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ప్రాణంతకంగా రహదారులు..!

By Newsmeter.Network  Published on  5 Jan 2020 3:18 AM GMT
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ప్రాణంతకంగా రహదారులు..!

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు టూరిస్ట్‌ బస్సుని ఢీకొని పక్కనే వెళ్తున్న మెలాసిన్‌ లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టూరిస్ట్‌ బస్సు పూర్తిగా దగ్ధమైంది. టూరిస్ట్‌ బస్సులో ఉన్న పది మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. టూరిస్ట్‌ బస్సు మహారాష్ట్ర నుంచి విశాఖప్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులోని 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె కనుమలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే స్థానికులు 12 మందిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో 13 మంది గాయాలపాలైన వారిని మైదుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట నుంచి 20 రోజుల కిందట యాత్రికులతో బయల్దేరిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ తిరుమళ్తూ వెళ్తూ ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌ ఓవర్‌ టేక్‌ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Road accidents

చిత్తూరు జిల్లా గంగవరం మండలం కల్లుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్‌ బస్సును ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలు కాగా మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం నుంచి కొడైకెనాల్‌కు విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. విద్యార్థులంతా వికాస్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Next Story