ఘోర ప్రమాదాలు.. ఆరుగురు మృతి..!

By Newsmeter.Network  Published on  4 Jan 2020 3:35 AM GMT
ఘోర ప్రమాదాలు.. ఆరుగురు మృతి..!

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహేంద్రతనయ నదిలోకి కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటన మందస మండలం కొత్తపల్లి వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒడిశా వాసులుగా స్థానికులు గుర్తించారు. మృతుల్లో చంటిపాపతో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సింహాచలం నుంచి బరంపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

లోయలో పడ్డ బస్సు..

అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కర్నాటకలోని ఉడిపి సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో విద్యార్థి ఫకృద్దీన్‌ మృతి చెందగా, 35 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 11 మంది టీచర్లు, 39 మంది విద్యార్థులు ఉన్నారు. క్షతగాత్రులను మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు.

Next Story