కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
By Newsmeter.NetworkPublished on : 17 Jan 2020 12:25 PM IST

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్నట్రాక్టర్ నందిగామ సమీపంలోని జొన్నలగడ్డ దగ్గర బోల్తాపడింది. ఈ ఘనలో ముగ్గురు కూలీలు అక్కడిక్కడే చనిపోగా మరో 10మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఘటన గురించి తెలియగానే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
ఘటన జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 25మంది కూలీలు ఉన్నారు. బాధితులను పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదల వాసులుగా గుర్తించారు. వ్యవసాయ పనుల కోసం గుమ్మడిదల నుంచి దేసినేనిపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read
పలమనేరు వాసులు ఐఎస్ఐ ఏజెంట్లు కాదు..!Next Story