ఘోర రోడ్డు ప్రమాదం..తల్లి, బిడ్డ మృతి

By రాణి  Published on  12 Feb 2020 1:22 PM GMT
ఘోర రోడ్డు ప్రమాదం..తల్లి, బిడ్డ మృతి

ఖమ్మం : విధి వక్రించింది. బహుశా ఆ కుటుంబంపై దేవుడు పగబట్టాడేమో. పాప, పుణ్యాలెరుగని..ఇంకా కళ్లు తెరిచి ప్రపంచంలోకి రాకుండానే..తల్లిగర్భంలో ఆరోగ్యంగా ఉన్న పసిబిడ్డను తీసుకెళ్లిపోయాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణీ మృతి చెందింది. గర్భిణీ కడుపులో ఉన్న మృత శిశువు అమాంతం ఎగిరి 10 అడుగుల దూరంలో పడటం..చూపరుల కంట నీరు తెప్పించింది. బాలుసుపాటి మురళి, తన భార్య కల్యాణి వైద్య పరీక్షల కోసం పెనుబల్లి మండల కేంద్రంలోని ఆస్పత్రికి వచ్చి తిరిగి ఇంటికి పయనమయ్యారు. మార్గమధ్యంలో సబ్ స్టేషన్ ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ మురళి దంపతులు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందింది. గర్భంలో ఉన్న శిశువు కూడా ఆమెతో పాటు ఎగిరిపడింది. నిండు గర్భిణీ అయిన కల్యాణిని, ఆమె కడుపులో నుంచి వచ్చిన శిశువును చూసి కంటతడి పెట్టనివారు లేరు. తల్లీ, బిడ్డ మృతి చెందడంతో మురళి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story
Share it