దుబాయ్ లో రోడ్డు ప్రమాదం..భారతీయ బాలిక మృతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 12:50 PM GMT
దుబాయ్ లో రోడ్డు ప్రమాదం..భారతీయ బాలిక మృతి..!

అబుదాబి: దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె నాలుగేళ్ల కూతురు అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన దూబాయ్‌కు 35 కి.మీ దూరంలో ఉన్న జెబెల్‌ అలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురును యూఏఈలోని ఓ పాఠశాలలో చదివిస్తుంది. ఈ నేపథ్యంలో కూతురిని స్కూల్‌ నుంచి తీసుకు రావడానికి బైక్‌పై వెళ్లింది. ఇంతలో ముందునుంచి కారులో అధిక వేగంతో దూసుకొస్తున్న ఓ ఆఫ్రికన్‌ మహిళ వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరు కిందపడిపోయారు. కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న మరో మూడు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ షార్జాలోని మువీలా ప్రాంతంలో అనుకొని సంఘటనతో ఓ మహిళ మృతి చెందింది. 17 ఏళ్ల మైనర్‌ కారును పార్క్‌ చేస్తున్న క్రమంలో..బ్రేక్‌ వేయకపోవడంతో నేరుగా తల్లిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మృతి చెందింది.

.

Next Story