అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెలుతున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

గార్లదిన్నె మండలం రామదాసుపేట సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై వెలుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. మృతులను గుత్తికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.