గ‌త కొద్ది రోజులుగా ఫామ్ లేమితో స‌త‌మ‌త‌వుతున్న టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ నేడు బ్యాట్ ఝుళిపించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అర్థ‌సెంచ‌రీ 69 బంతుల్లో 71(7x 4, 1×6) పరుగులు చేసి ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. సెంచ‌రీ వైపు అడుగిడుతున్న త‌రుణంలో మ‌ళ్లీ తనకు అచ్చిరాని షాట్‌ను ఆడి వికెట్‌ను సమర్పించుకున్నాడు.

పంత్‌.. త‌రుచుగా అవుట‌య్యే.. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్వేర్‌ లెగ్‌, డీప్‌ పాయింట్‌ల్లో ఔటయ్యే విధంగా మళ్లీ అదే తప్పిదం చేశాడు. బ్యాక్‌వర్డ్‌ స్వేర్‌ లెగ్‌లోకి భారీ షాట్‌ ఆడి పొలార్డ్ కు వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. పోలార్డ్ వేసిన‌ 40 ఓవర్‌ మూడో బంతిని కవర్స్‌ మీదుగా బౌండ‌రీకి త‌ర‌లించిన‌ పంత్‌.. ఆ మరుసటి బంతికు భారీ షాట్‌కు యత్నించాడు. బంతి పూర్తిగా బ్యాట్‌తో కాంటాక్ట్‌ కాకపోవడంతో పైకి లేచింది. హెట్‌మెయిర్‌ క్యాచ్‌ పట్టుకోవడంతో పంత్‌ సెంచరీ క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది.

ఇదిలావుంటే.. పంత్‌ వన్డేల్లో చాలా కాలం క్రింద‌ట‌ అరంగేట్రం చేసినా ఈ మ్యాచ్ లోనే త‌న మొద‌టి హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇక టీమిండియా స్కోరు 210 పరుగుల వద్ద ఉండగా.. పంత్‌ ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా.. ప్ర‌స్తుతం నిర్ణిత‌ 50 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 287/8 ప్కోరు చేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.