ముంబై: డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్
By సుభాష్ Published on 7 Oct 2020 11:21 AM IST
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరైంది. రియాకు బెయిల్ మంజూరు చేసిన ముంబై హైకోర్టు.. రియా సోదరుడు షోవిక్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. గత నెల 9వ తేదీ నుంచి ముంబై జైకుల్లా జైలులో ఉన్న రియాకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా, ముంబై విడిచి వెళ్లరాదని రియాకు కోర్టు ఆదేశించింది.
కాగా, సుశాంత్ మృతి కేసులో మొదలైన దర్యాప్తు.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ కోణాన్ని బయటకు తెచ్చింది. డ్రగ్స్ సరఫరా అనుమానాలతో మూడు రోజులు విచారించి రియాను గత నెల 9న అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు కలిపి మొత్తం 19 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే రకుల్, శ్రద్దా, కపూర్, సారా అలీఖాన్, దీపికా పదుకొనేలను సైతం ఎన్సీబీ అధికారులు విచారించారు.
Also Read
తమిళనాడు: సీఎం అభ్యర్థిగా పళనిస్వామిNext Story