హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన స్టైల్‌లో కరోనా వైరస్‌పై మరోసారి స్పందించాడు. ఎప్పుడు.. ఎదో టాఫిక్‌తో నిత్యం ఆర్జీవీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘ఉగాది కావాలి అంటే ఇంట్లో ఉండండి.. ఒళ్లంతా పచ్చడి కావాలంటే బయటకు రండి-పోలీసు హెచ్చరిక’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆర్జీవీపై ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు. వాట్‌ ఏ టైమింగ్‌ సార్‌.. అంటూ ఒకరు కామెంట్‌ చేయగా.. ఇంకొకరు మరీ మీరు ఎం చేస్తారంటూ ప్రశ్నించారు.

రేపు తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగ. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఉగాది పండుగ జరపమని చెప్పారు. ఉగాది పండుగకు అందరూ దూరంగా ఉండాలని ఆయన కోరారు.

 

ఇదిలా ఉంటే భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 519కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్‌ బారిన పడి 40 మంది కోలుకున్నారని తెలిపింది. అయితే మహమ్మారి కరోనా బారిన పడి తొమ్మిది మంది మాత్రమే మృతి చెందారని తెలిపింది. ప్రస్తుతం 24 రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విస్తరించింది

 

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.