'దిశ' నిందితుడు చెన్నకేశవులు భార్యను కలిసిన ఆర్జీవీ.. ఎందుకంటే.?

By అంజి  Published on  2 Feb 2020 9:08 AM GMT
దిశ నిందితుడు చెన్నకేశవులు భార్యను కలిసిన ఆర్జీవీ.. ఎందుకంటే.?

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా 'దిశ' హత్య, అత్యచార ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్‌కౌంటర్‌లో వారిని మట్టుబెట్టారు. కాగా నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్యను ప్రముఖ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కలిశారు. ఆదివారం రోజున ఆమెతో భేటీయిన రామ్‌గోపాల్‌ వర్మ.. పలు అంశాలపై ఆమెతో చర్చించనట్లు సమాచారం.

దిశ ఘటన నిందితుడు చెన్నకేశవుల్ని రేణుక 16 ఏళ్లకే పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. అతడు దిశతో పాటు భార్య రేణుకను కూడా బాధితురాలిని చేశాడంటూ వర్మ పేర్కొన్నాడు. నిందితుడు చెన్నకేశవులు చేసిన పనికి.. ఇప్పుడు భార్యతో పాటు.. పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయిందని ఆర్జీవీ అన్నారు.య‌ధార్థ‌ ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాలను తెరకెక్కించ‌డంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దిట్ట అన్న విషయం తెలిసిందే. ఇందుకు నిదర్శనం.. ఇప్పటివరకూ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ వివాదస్పద చిత్రాలే. ఇదిలావుంటే.. వ‌ర్మ తాజాగా కొద్ది రోజుల క్రితం మొత్తం దేశాన్ని కుదిపేసిన ‘దిశ’ ఘటన ఆధారంగా సినిమా తీయ‌నున్న‌ట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విటర్ అకౌంట్‌ ద్వారా తెలిపారు.

Next Story