రివ్యూ : విజిల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Oct 2019 12:31 PM GMT
రివ్యూ : విజిల్

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ - స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అట్లీ కాంబినేష‌న్ లో రూపొందిన తాజా చిత్రం 'బిగిల్'. దీనిని 'విజిల్' టైటిల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. పోలీస్‌(తెరి), అదిరింది(మెర్స‌ల్‌) ఈ రెండు బ్లాక్ బ‌స్టర్ చిత్రాల త‌ర్వాత విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్ లో రూపొందిన సినిమా కావ‌డంతో 'విజిల్' పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించింది. ఏజీయ‌స్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై మ‌హేష్ కోనేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. దీపావ‌ళి సంద‌ర్భంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా ఈ రోజు (అక్టోబ‌ర్ 25) రిలీజైంది. మ‌రి.. విజిల్ ప్రేక్ష‌కుల‌తో విజిల్ వేయించిందా..? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థేటంటే: రాజ‌ప్ప‌(విజ‌య్) విశాఖ‌ప‌ట్నంలో ఓ రౌడీ. త‌న‌ని న‌మ్ముకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తుంటాడు. అత‌ని కొడుకు మైకేల్ అలియాస్ బిగిల్ (విజ‌య్) ఫుట్ బాల్ ప్లేయ‌ర్. అత‌ని ఆట‌తో బ‌స్తీలో ఉన్న కుర్రాళ్లు అంద‌రిలో మార్పు తీసుకువ‌స్తాడు. ఇది గ‌మ‌నించిన రాజ‌ప్ప కొడుకు బిగిల్ ని గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండ‌మంటాడు. మైకేల్ జాతీయ స్ధాయిలో ఛాంపియ‌న్ గా నిలిచి క‌ప్పు సాధిస్తే చూడాల‌నుకుంటాడు. అయితే.. రాజ‌ప్ప‌ను ప్ర‌త్య‌ర్ధులు చంపేస్తారు. తండ్రి రాజ‌ప్ప ని చంపేయ‌డం క‌ళ్లారా చూసిన మైకేల్ తండ్రి వార‌సత్వాన్ని తీసుకుని రౌడీగా మార‌తాడు. అయితే.. అనుకోకుండా మ‌హిళ‌ల ఫుట్ బాల్ టీమ్ కి కోచ్ గా వెళ్లాల్సివ‌స్తుంది. రౌడీ అయిన మైకేల్ ని కోచ్ గా అంగీక‌రించారా..? మైకేల్ కి అడ్డుప‌డే శ‌ర్మ ఎవ‌రు..? తండ్రి రాజ‌ప్ప క‌ల‌ను మైకేల్ నిజం చేసాడా..? లేదా..? అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

విజ‌య్ న‌ట‌న‌

సినిమాటోగ్ర‌ఫీ

నిర్మాణ విలువ‌లు

సెకండాఫ్

మైన‌స్ పాయింట్స్

ఫ‌స్టాఫ్

నిడివి ఎక్కువుగా ఉండ‌డం

పాట‌లు

విశ్లేష‌ణ - విజ‌య్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ సినిమాలో రెండు పాత్ర‌ల మ‌ధ్య వేరియేష‌న్ బాగానే చూపించిన‌ప్ప‌టికీ కొన్ని సీన్స్ లో మాత్రం ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అయ్యేలా చిత్రీక‌రించ‌లేదు. అయితే.. విజ‌య్ ని అభిమానులు ఎలా చూడాల‌నుకుంటారో అలా చూపించారు.

ఎలాఉందంటే:

ఫ‌స్టాఫ్ లో పాత్రల ప‌రిచ‌యానికి ఎక్కువ టైమ్ తీసుకున్న‌ట్టు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ కి వ‌చ్చేస‌రికి మ‌హిళ‌ల పై యాసిడ్ దాడి, మ‌హిళ‌లు ఇంటికే ప‌రిమితం కాకూడ‌దు.. క్రీడ‌ల్లో కూడా రాణిస్తున్నార‌ని తెలియ‌చేసే స‌న్నివేశాల‌ను జొప్పించి క‌థ‌ను మ‌రింత ఎమోష‌న‌ల్ గా న‌డిపించ‌డంలో అట్లీ స‌క్స‌స్ అయ్యాడు.

నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కనిపించలేదు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దుమ్మురేపుతున్న ఈ అందాల భామ సాదాసీదా పాత్రలో నటించింది. విజయ్‌కి ప్యాడింగ్ ఆర్టిస్టుగా పాటలకు, కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. పైగా విజ‌య్, న‌య‌న‌తార పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు ఏవీ కూడా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. జాకీష్రాఫ్ త‌న‌దైన స్టైల్ లో విల‌న్ పాత్ర పోషించారు.

హైలెట్స్‌:

న‌టీన‌టులు పాత్ర ప‌రిథి మేర‌కు న‌టించారు. ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాట‌లు ఏమీ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి.

జీకే విష్ణు అందించిన సినిమాటోగ్ర‌ఫీ సినిమాకి హైలెట్ అని చెప్ప‌చ్చు. అయితే... స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వ‌చ్చిన సినిమాల్లో కొన్ని సీన్స్, హీరో ఓ బ‌స్తీకి నాయ‌కుడుగా వ‌చ్చిన సినిమాల్లో కొన్ని సీన్స్... ఇలా ఒక్కొ సినిమాలోంచి కొన్ని సీన్స్ తీసుకుని ఈ క‌థ రాసుకున్నాడా..? అనిపిస్తుంది. అందుచేత క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమాత్రం క‌నిపించ‌లేదు. ఫైన‌ల్ గా విజిల్ గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే... విజిల్ విజ‌య్ ఫ్యాన్స్ కి మాత్ర‌మే.

రేటింగ్ 2.7 5/5

Next Story
Share it