మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నర్సింగ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌పై డ్రోన్‌ వీడియోలు తీసిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు కొండల్‌ రెడ్డిపైన కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ వాడినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. కాగా, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న రేవంత్‌రెడ్డిని ఎయిర్‌పోర్ట్‌ లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 8 మందిపైన కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 184, 187, 11 రెడ్‌విత్‌ 5ఏ, ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.