నెటిజన్లకు ఎమోషన్‌గా సమాధానమిచ్చిన 'రేణుదేశాయ్‌'

By సుభాష్  Published on  30 Dec 2019 7:45 PM IST
నెటిజన్లకు ఎమోషన్‌గా సమాధానమిచ్చిన రేణుదేశాయ్‌

నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన రేణుదేశాయ్, ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతోకలిసి ఒంటరిగి జీవిస్తోంది. ఇక రేణుదేశాయ్‌ తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు గాని, వారి అల్లరిచేష్టలతో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. రేణుదేశాయ్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ బాగానే ఉంటుంది. రేణు బుల్లితెరపై హోస్ట్‌ గా వ్యవహరిస్తూ తన పిల్లలైన అకీరా, అధ్యలతో కలిసి పుణేలో ఉంటున్నారు. తాజాగా కొడుకు అకీరా తన చెల్లెలును ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ.. మీరు 1,2,3 లెక్కపెట్టేలోపు మీ ముందుంటా.. అద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్‌.. వారిద్దరూ నా సొంతం అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ఇందుకు నెటిజన్లు స్పందిస్తూ.. ఎంతైనా పవన్‌ రక్తం కదా.. అంటూ కామెంట్ చేశారు. అలా కామెంట్ చేయడం రేణు దేశాయ్‌కి నచ్చలేదు అనుకుంటా.. వెంటనే ఆమె కూడా స్పందించారు. టెక్నికల్‌, సైన్స్‌ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్‌ సైన్స్‌ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేక చెప్పనవసరం లేదు అంటూ సమాధానం ఇచ్చారు.

ఇక రేణుదేశాయ్‌ కామెంట్‌కు మరో అభిమాని స్పందిస్తూ.. అభిమానులు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు.. వాటిని మీరు ఎందుకు పట్టించుకుంటారు అంటూ ప్రశ్నించారు. దీనికి మళ్లీ రేణు స్పందిస్తూ.. అమ్మతనం గురించి మాట్లాడుతుంటే నేను ఎలా మౌనంగా ఉంటాను అని కొంచెం ఎమోషన్‌గా సమాధానం ఇచ్చారు.

కాగా, రేణు పవన్ కల్యాణ్ తో విడిపోయిన తర్వాత చాలా రోజులుగా ఎన్నోఇబ్బందులు పడుతూ నెట్టుకొస్తోంది. ఇక జీవితంలో తనకు ఓ తోడు కావాలని నిర్ణయించుఉకన్నారు. ఓ వ్యాపారవేత్తను ప్రేమించానని, త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నానని కొన్ని నెలల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. అతనితో నిశ్చితార్థం అయినట్లు కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా ఇప్పటి వరకు రేణు నుంచి వివాహానికి సంబంధించిన ఎలాంటి వార్తలు రాలేదు. ఇక పెళ్లి ఆగిపోయిందేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Next Story