జియో కస్టమర్లకు గుడ్ న్యూస్‌

By సుభాష్
Published on : 31 March 2020 6:25 PM IST

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్‌

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం అవుతోంది. ఇక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనా కారణంగా వివిధ టెలికాం కంపెనీలు తమ తమ వినియోగదారులకు ఊరట కలిగించే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రిలయన్స్‌ జియో కూడా తన కష్టమర్లకు శుభవార్త వినిపించింది.

జియో వినియోగదారులకు ఏప్రిల్‌ 17వ తేదీ వరకు 100 నిమిషాల కాల్స్‌, 100 మెసేజ్‌లు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ వంద నిమిషాలు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే జియో ఫోన్‌ వినియోగదారుల ప్రీపెయిడ్ వ్యాలిడిటీ పూర్తయినప్పటికీ వారికి ఏప్రిల్‌ 17 వరకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సేవలు అందజేస్తామని జియో పేర్కొంది.

Next Story