గుడ్‌ న్యూస్‌: మరింత తగ్గిన పసిడి ధర

By సుభాష్  Published on  31 March 2020 3:49 AM GMT
గుడ్‌ న్యూస్‌: మరింత తగ్గిన పసిడి ధర

బంగారం ధర మరింత తగ్గంది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది. దీంతో బంగారం ప్రియులకు తీపి కబురు అందించినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో మన దేశంలోనూ ప్రతికూల ప్రభావం చూపిందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది.

కాగా, మంగళవారం హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 215 తగ్గింపుతో, రూ. 43,170కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గుతూ రూ.39,520క చేరుకుంది. అలాగే వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. రూ. 10 తగ్గుదలతో కిలో వెండి రూ. 39,500లకు పడిపోయింది.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం దిగొచ్చింది. ప్రస్తుతం 1639 డాలర్ల వద్ద ఉంది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గడంతో 1640.35 డాలర్లకు పడిపోయింది.

దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గింపుతో రూ. 41,020కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.420 తగ్గుతూ రూ.43,300లకు పడిపోయింది. ఇక వెండి కూడా ప్రస్తుతం రూ.39,500లకు చేరుకుంది.

Next Story