మళ్లీ తగ్గిన బంగారం ధరలు
By సుభాష్ Published on 26 Aug 2020 7:06 PM IST
బంగారం, వెండి తగ్గుదల కొనసాగుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి వరుసగా పసిడి, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు నెలలుగా ఏగబాకిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.210 తగ్గి రూ.53,660కు చేరింది. ఇక వెండి కిలో ధర రూ.1077 తగ్గి ప్రస్తుతం 65,175 ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూలతలు, రూపాయి మారకం విలువ మెరుగు పడటంతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో మూడు పైసలు మెరుగు పడి 74.30 వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1918 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 26.45 డాలర్ల వద్ద ట్రేడైంది.
స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ ధరలు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు బంగారం ప్రియులకు సూచిస్తున్నారు.