తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

By సుభాష్  Published on  12 Oct 2020 4:48 AM GMT
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 30,210 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 1,021 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,13,084కు చేరగా, గడిచిన 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1228కి చేరింది. ఒక రోజే కరోనా నుంచి 2,214 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,87,342 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,514 మంది యాక్టివ్‌లో ఉండగా, వారిలో 20,036 మంది హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతం ఉండగా, దేశంలో 1.5శాతం ఉంది. కోలుకున్నవారి రేటు 87.91శాతం ఉండగా, దేశంలో 86.2 శాతం ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 228 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో పదుల సంఖ్యలోనే నమోదయ్యాయి.

Covid

Next Story