కొండెక్కిన చికెన్‌ ధర

By సుభాష్  Published on  12 Oct 2020 2:06 AM GMT
కొండెక్కిన చికెన్‌ ధర

చికెన్‌, గుడ్ల ధరలు కొండెక్కాయి. నెల రోజుల్లోనే అదనంగా రూ.50 పెరిగింది. ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.260కు చేరింది. ఇక గుడ్డు ధర రూ.6కు చేరింది. కోవిడ్‌ నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు విక్రయాలు జోరుగా సాగాయి. వైద్యులు సూచనలు ఇందుకు కారణమయ్యాయి. లాక్‌డౌన్‌ ప్రారంభానికి ముందు వారానికోమారు చికెన్‌ తిన్న కుటుంబాలు ఇప్పుడు వారంలో రెండు, మూడు సార్లు తింటున్నారు. కరోనా వ్యాప్తి నుంచి చికెన్‌, గుడ్లతో పాటు చేపలు, మాంసం వినియోగం బాగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 1.80 కోట్ల గుడ్ల అమ్మాకలు ఉండగా, ఇప్పుడు 2 కోట్లకు పైగా అమ్ముడుపోతున్నాయి. గుడ్డు చిల్లర ధర రూ.5 ఉండగా, రూ.6కు పెరిగింది. కరోనా కారణంగా చికెన్‌, గుడ్డు ధరలు పెరుగుతున్నా.. అది స్వల్పకాలమేనని, తర్వాత ధరలు తగ్గుముఖం పడతాయని చికెన్‌ వ్యాపారులు చెబుతున్నారు.

అయితే గతంలో కంటే ఇప్పుడు విక్రయాలు బాగా పెరిగాయి. కరోనా వైరస్‌ కారణంగా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని వైద్య నిపుణులు పదేపదే సూచిస్తుండగా, అందులో చికెన్‌, గుడ్లు బాగా తినాలని ప్రత్యేక సూచిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు వైరస్‌ బారిన పడకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు మాంసం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

Next Story