ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు మళ్లీ మొదలయ్యారు. గత కొన్ని రోజుల కిందట చెలరేగిపోయిన స్మగ్లర్లు.. పోలీసుల చర్యలతో ఈ మధ్యన కనిపించకుండా పోయారు. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో స్మగర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొండవాడ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేస్తుండగా, 28 ఎర్ర చందనం దుంగలతో తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేసి, ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 59 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.