ఎర్రచందనం దుంగల పట్టివేత.. పోలీసుల అదుపులో ఇద్దరు
By సుభాష్ Published on 2 Feb 2020 2:46 PM IST
ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు మళ్లీ మొదలయ్యారు. గత కొన్ని రోజుల కిందట చెలరేగిపోయిన స్మగ్లర్లు.. పోలీసుల చర్యలతో ఈ మధ్యన కనిపించకుండా పోయారు. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో స్మగర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొండవాడ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేస్తుండగా, 28 ఎర్ర చందనం దుంగలతో తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి, ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 59 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
Next Story