2.5 మిలియన్ డిస్‌లైక్‌లతో.. 'సడక్ ‌2' ట్రైలర్‌ రికార్డు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2020 8:17 PM IST
2.5 మిలియన్ డిస్‌లైక్‌లతో.. సడక్ ‌2 ట్రైలర్‌ రికార్డు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌ను ఓ కుదుపుకుదిపేసింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్‌ మరణానికి కారణం బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం(బంధుప్రీతి) కారణం అని వినిపిస్తున్నాయి. సుశాంత్‌ మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయాలని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కోరుతున్నారు. సుశాంత్ మరణంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ ఎంక్వైరీ వేసింది.

ఇదిలా ఉంటే.. సుశాంత్ మరణం వెనక కరణ్ జోహార్, ఆలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, మహేష్ భట్ ఉన్నారని.. వాళ వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నడాని పలువురు అనుమానిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆలియా భట్‌ ఫాలోవర్స్‌ గణనీయంగా తగ్గిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన సడక్‌ 2 చిత్రం పై ఈ ప్రభావం పడింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఇలా విడుదలై అయ్యిందో లేదో ఓ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్‌కు డిస్‌లైక్‌ల వరద పారుతోంది.

ఈ సినిమాకు మహేష్ భట్ దర్శకత్వం వహించడంతో పాటు ఆలియా భట్ నటించడం వల్ల సుశాంత్ అభిమానులు రెచ్చి పోయి మరీ యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు అన్ లైక్ కొడుతున్నారు. కేవలం 9 గంటల్లో ఈ ట్రైలర్ 5.4 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. అయితే 2.5 మిలియన్ అన్ లైక్స్ ను కూడా పొందడం చెత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివిటి ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని.. అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్‌స్టార్ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.

Next Story