టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు నిన్న రాత్రి ఔట‌ర్ రింగ్ రోడ్డు మీద‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే.. శంషాబాద్ రూర‌ల్ ఎస్సై వెంకటేష్ ఈ ప్రమాదానికి సంబందించి వివరాలు వెల్ల‌డించారు. నిన్న‌రాత్రి 12.49 గంటలకు పెద్ద అంబర్‌పేట్ ఓఆర్ఆర్‌పైకి రాజశేఖర్ కారు ఎంటర్ అయినట్లు ఆయ‌న‌ తెలిపారు. స‌రిగ్గా 1.20గంటలకు ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింద‌ని.. దీంతో వెంట‌నే సంఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు.

సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకోగానే ప్రమాదానికి గురైన కారు రాజశేఖర్‌కు చెందిందిగా గుర్తించినట్లు చెప్పారు. కారుకు ప్రమాదం జరిగిన తర్వాత రాజశేఖర్ మరో కారులో వెళ్లిపోయినట్లు వివరించారు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఇన్స్‌స్పెక్ట‌ర్ వెంక‌టేష్ తెలిపారు. కారులో ఎటువంటి మద్యం బాటిళ్లు లభించలేద‌ని.. సెక్షన్ ఐపీసీ 279 కింద కేసు నమోదుచేశామ‌ని తెలిపారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.