క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఐపీఎల్‌(ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) 13వ సీజ‌న్ ఏప్రిల్ 15 వ‌ర‌కు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్పటికి పరిస్థితులు అనుకూలిస్తేనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్‌ జరుగుతుందా.. లేదా అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా అందుకోసం సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ స్టోక్స్‌ తెలిపాడు.

‘ నా తదుపరి కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఏదైనా ఉందంటే అది ఐపీఎలే. అందుకోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నా. ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టేశా’ అని ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్ అన్నాడు.

ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ చేసిన కామెంట్స్‌ని ఓ నెటిజ‌న్ త‌ప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేశాడు. దీంతో బెన్‌స్టోక్స్ కూడా ఆ అభిమానికి గట్టిగా స‌మాధానం చెప్పాడు.

‘నీ ఐపీఎల్‌ డబ్పులు కూడా లాక్‌డౌన్‌లో పడ్డాయ్‌. ఆ డబ్బుల్ని మరిచిపో. కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరి కోసం ఆలోచించు’ అని  అభిమాని విమర్శించాడు. దీంతో స్టోక్స్‌ కు చిర్రెత్తుకొచ్చింది. ’హెడ్‌లైన్స్‌ చూసి ఏదో మాట్లాడకు.. మొత్తం ఆర్టికల్‌ చదవి మాట్లాడు’ అంటూ మండిపడ్డాడు. ఈ క్రమంలోనే తన అన్న మాటల్ని ట్వీట్‌ చేశాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆడనున్న స్టోక్స్‌ను 2018లో ఆ ఫ్రాంచైజీ రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.