సీఎస్‌కేను చిత్తు చేసిన ఆర్సీబీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 1:20 AM GMT
సీఎస్‌కేను చిత్తు చేసిన ఆర్సీబీ

ఐపీఎల్‌-2020లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్ జ‌ట్టు ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. ముందుగా కెప్టెన్ కోహ్లీ విజృంభ‌ణ‌తో సీఎస్‌కే ముందు 170ప‌రుగుల‌ ల‌క్ష్యాన్ని ఉంచిన ఆర్సీబీ.. అనంత‌రం బౌల‌ర్లు రాణించ‌డంతో‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.

చెన్నైను 132 పరుగులకే కట్టడి చేసింది. సీఎస్‌కే జట్టులో అంబటి రాయుడు(42; 40 బంతుల్లో 4 ఫోర్లు), జగదీషన్‌(33;28 బంతుల్లో 4ఫోర్లు)లు మాత్రమే ఓ మోస్త‌రుగా ఆడ‌గా.. మిగతా వారు విఫలమయ్యారు. ఆర్సీబీ నిర్దేశించిన 170 పరుగుల టార్గెట్‌తో చేధ‌న‌కు దిగిన చెన్నై ఓపెన‌ర్లు డుప్లెసిస్‌(8), వాట్సన్‌(14)లు నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో మోరిస్‌ మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్‌ సుందర్‌కు రెండు వికెట్లు లభించాయి. ఉదాన,చహల్‌కు చెరో వికెట్‌ దక్కింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దేవదూత్‌ పడిక్కల్‌(33; 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి( 90 నాటౌట్‌; 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శివం దూబే( 22 నాటౌట్‌; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించడంతో పోరాడే స్కోరును బోర్డుపై ఉంచారు. సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు సాధించగా, సామ్‌ కరాన్‌, దీపక్‌ చాహర్‌లకు తలో వికెట్‌ లభించింది.

Next Story