ముఖ్యాంశాలు

  • 30 మంది బడా రుణ ఎగవేతదారుల జాబితా బట్టబయలు
  • ది వైర్ వెబ్ సైట్ దాఖలు చేసిన పిటిషన్ కు ఆర్బీఐ సమాధానం
  • రుణ ఎగవేతలో 3 సంస్థలు చోక్సీవే
  • 11వేల కంపెనీలు ఉద్దేశపూర్వంకంగా రుణాలు ఎగవేత

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీ ఐ) తాజాగా 30 మంది బడా ఋణ ఎగవేతదారుల జాబితాను బట్టబయలు చేసింది. ది వైర్ అనే వెబ్ సైట్ దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ కు జవాబునిస్తూ ఈ పేర్లను వెల్లడించింది. నాలుగు సంవత్సరాల పోరాటం తరువాత, సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత కానీ ఈ జాబితాన ఆర్బీఐ విడుదల చేయలేదు. ఇందులో మూడు సంస్థలు ప్రస్తుతం దేశం వదిలి విదేశాల్లో దాక్కున్న మేహుల్ చోక్సీకి చెందినవే కావడం విశేషం. ఈ 30 కంపెనీలు కలిసి మొత్తం రూ. 50000 కోట్లు దోచేసుకున్నాయి. ఇందులో కొ్న్ని మొండి బాకీలుగా బ్యాంకులు తమ ఖాతాలనుంచి కొట్టేసినవి కూడా ఉన్నాయి.

ఈ ఎగవేతదారు కంపెనీల్లో గీతాంజలి జెమ్స్, రోటోమాక్ గ్లోబల్, జూమ్ డెవలపర్స్, డక్కన్ క్రానికల్ హోల్డింగ్స్, విన్ సమ్ డైమండ్స్, ఆర్ ఈ ఐ ఎగ్రో, సిద్ధి వినాయక్ లాజిస్టిక్స్, కుడోస్ కెమీలు ఉన్నాయి. తమాషా ఏమిటంటే ఆర్ బీ ఐ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నాలుగు సంవత్సరాల వరకూ వివిధ సాకులు చెబుతూ జాబితాను జారీ చేయడంలో తాత్సారం చేసింది. అంతకు ముందు పదేళ్లుగా అంటే మన్మోహన్ సింగ్ పాలనా కాలంలో ఈ జాబితాను అసలు బయటపెట్టలేదు. ఇలా బయటపెట్టడం దేశ ఆర్ధిక ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తుందని కూడా ఆర్బీఐ వాదించింది. ఇలాంటి డిఫాల్టర్ల వివరాలను సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ లేదా క్రిలిక్ అనే సంస్థ ఇప్పటి వరకూ తన వద్దే ఉంచుకుంది. అయితే సిబిల్ డేటా ప్రకారం దేశంలో దాదాపు 11000 కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఋణ చెల్లింపులు చేయకుండా డిఫాల్ట్ చేశాయి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.