బ్యాంకులను మోసం చేసిన రెండు కంపెనీలపై సీబీఐ కేసులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 3:41 PM GMT
బ్యాంకులను మోసం చేసిన రెండు కంపెనీలపై సీబీఐ కేసులు..!

బ్యాంకులను మోసం చేసిన రెండు కంపెనీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. సుధాంశు ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ పై చెన్నై సీబీఐ ఆర్దిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. రుణాల పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.8.75కోట్ల మోసం చేసినట్లు అభియోగాలు మోపింది. సుధాంశు డైరెక్టర్లు మద్దాల రమేష్ రెడ్డి, బోళ్ల రఘుపతిరావు, యద్దాల రమణారెడ్డిపై కేసు నమోదు చేసింది. ఇంక్లయిన్ ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పై కూడా హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇంక్లయిన్ డైరెక్టర్లు విక్రం బాబు, కె.శివకుమార్ పైనా కేసులు పెట్టారు. న్యాయవాదులు మాగంటి సత్యనారాయణ రావు, ఎ.శ్రీనివాస ప్రసాద్ పై కూడా కేసు పెట్టారు. ఎస్ బీఐ అధికారి అబ్దుల్ రవూఫ్ పాషాపై సీబీఐ కేసు నమోదు చేసింది. రుణాల పేరుతో ఎస్‌బీఐని రూ.6కోట్ల మోసం చేశారని ఇంక్లయిన్ పై అభియోగం మోపారు.రెండు కంపెనీల డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

Next Story