ఇక్క‌డ మంత్రుల‌కు ప‌నిలేదు.. అందుకే ఏపీలో కోడి పందాలు

By Newsmeter.Network  Published on  16 Jan 2020 10:27 AM GMT
ఇక్క‌డ మంత్రుల‌కు ప‌నిలేదు.. అందుకే ఏపీలో కోడి పందాలు

హైదరాబాద్ : తెలంగాణ‌లో మంత్రుల‌కు ప‌ని లేద‌ని అందుక‌నే ఆంధ్ర‌కు వెళ్లి కోడిపందాలు ఆడుతున్నార‌ని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్టాడుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అనీ, అలాంటి పార్టీ పై విమ‌ర్శ‌లు చేసే ముందు ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌న్నారు. ఏపీలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. తెలంగాణ మంత్రులు వెళ్లి పుండు మీద కారం చల్లుతున్నారని, మంత్రి తలసాని సభ్యతగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని రావుల స్పష్టం చేశారు. మంత్రి త‌ల‌సాని త‌నకు కేటాయించిన శాఖ పై దృష్టి పెడితే మంచిద‌న్నారు.

Next Story