ముఖ్యాంశాలు

  • 80వ వ‌డిలోకి రవిశాస్త్రి తల్లి
  • ట్విట‌ర్ ద్వారా విషేస్

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి త‌న త‌ల్లికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. బుధవారం రవిశాస్త్రి తల్లి లక్ష్మిశాస్త్రి పుట్టినరోజు. ఈ రోజుతో లక్ష్మిశాస్త్రి 80వ ఏట ప్రవేశించారు. బంగ్లాదేశ్ తో సిరీస్ సంధ‌ర్బంగా ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉన్న రవిశాస్త్రి ట్విట్టర్ వేదికగా తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘నా మార్గనిర్దేశకురాలు, అతి పెద్ద విమర్శకురాలు మా అమ్మే. హ్యపీ బర్త్‌డే మామ్‌. గాడ్‌ బ్లెస్‌ యూ’ అంటూ రవిశాస్త్రి ట్వీట్‌ చేశారు. అంతేకాదు తన తల్లితో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. శాస్త్రి షేర్ చేసిన ఈ ఫొటో కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది. సోషల్‌ మీడియా వేదికగా రవిశాస్త్రి తల్లికి అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.