తిరుమల తిరుపతిలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ పర్వదినం రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారిని ఊరేగించనున్నారు. రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం సమీక్షించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రథసప్తమి రోజున అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్