జూలై 19 ఆదివారం నుండి జూలై 25 శనివారం వరకు
By తోట వంశీ కుమార్ Published on 19 July 2020 7:42 AM ISTమేష రాశి :
ఈ రాశివారికి ధనలాభము సంపద ఆనందాన్ని కలగజేస్తున్నాయి. సముడైన చంద్రుడు వీరికి లాభ సూచనను కల్పింప చేస్తున్నాడు. యోగ కారకుడైన కుజుడు మాత్రం వ్యయంలో ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. మారకుడైన శని రాజ్యస్థాన మైన పదిలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఒత్తిడులను కలిగిస్తున్నాడు. శుక్రుడు ద్వితీయ మందుంటూ వీరికి చక్క నైన గౌరవాన్ని అభిమానాన్ని కలిగించే అవకాశం యిస్తాడు. తృతీయ మందున్న రాహువు సంపదలు ఇస్తుంటే భాగ్యంలో ఉన్న కేతువు మాత్రం శత్రువృద్ధిచేస్తాడు. ఈ వారంలో వీరికి గురుడు ఆర్థిక పరిపుష్టిని సమకూర్చి ఆదుకుంటాడు. మొత్తం మీద వీరికి ఈ వారం మధ్యమ ఫలితాలు లభిస్తాయి. అశ్విని నక్షత్ర జాతకులకు సాధన తార కాబట్టి ఫలితాలు చాలా బాగున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారైంది ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. కృత్తిక ఒకటో పాదం వారికి క్షేమ తారైంది కాబట్టి ఫలితాలు బాగున్నట్లే.
పరిహారం : ప్రతిరోజూ సూర్య దర్శనం చేయండి. చంద్రునికి ప్రీతిగా అన్నదానం గాని లేదా స్వయం పాకం దానం చేయించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి.
వృషభరాశి :
ఈ రాశివారికి సంపదలు ఆభరణ ప్రాప్తి శరీర సౌఖ్యం నుంచి ఆనందాన్ని అభివృద్ధిని కలిగిస్తున్నాయి. చతుర్థంలో ఉన్న రవి సంపదల్నిస్తూన్నాడు. వారం చివరలో చంద్రుడు కొంత అనారోగ్యాన్ని కార్య భారాన్ని సూచిస్తున్నాడు. కుజుడు లాభాల్లో ధన ప్రాప్తిని ఇస్తున్నాడు. శుక్రుడు లగ్నంలో ఉండటం వల్ల శరీర సౌఖ్యాన్ని సూచిస్తున్నాడు. రాహువు మాత్రం అకారణ కలహాన్ని సూచిస్తున్నాడు. కేతువు వీరికి సుఖ జీవనాన్ని ఇస్తున్నాడు బుధుడు స్వర్ణాభరణ ప్రాప్తిని ఇంతవరకు వాయిదా పడిన అప్పులను నెరవేరుస్తూ మంచి ఫలితాన్ని ఇవ్వనున్నాడు. భూ సంబంధ వ్యవహారాలు ఆర్థిక సంబంధ వ్యవహారాలు ఈ వారంలో కొంత చక్కబడతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించండి ఈ రకంగా వీరికి ఈ వారం యాభై అరవై శాతం శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు క్షేమ తారైంది ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు విపత్తారైంది జాగ్రత్త వహించండి. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి సంపత్తారైంది ఆర్థిక స్థితి బావుంటుంది.
పరిహారం : రాహువుకి జపం చేయించండి. గురుచరిత్ర పారాయణ లేదా దత్త చరిత్ర పారాయణ చేయండి. శనికి చేనువ్వులు నల్లని వస్త్రం తైలము దానం చేస్తే మంచిది.
మిధున రాశి :
ఈ రాశివారు కుటుంబంతో కొంత ఆనందాన్ని సుఖ సౌఖ్యము ఉత్సాహంకూడా పొందుతారు. చంద్రుడు ధన వ్యయాన్ని కుటుంబంల్లో ఆరోగ్య భంగాన్ని సూచిస్తున్నాడు. రవి కూడా కుటుంబంలో ఉన్న పెద్దకి అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. బుధుడు లగ్నంలో ఉన్నప్పటికీ చిక్కులను పరిష్కరించలేక శని ప్రభావం చేత కుటుంబంలో చాలా ఇబ్బందుల్ని సూచిస్తున్నాడు. రాహు కేతువుల స్థితి కూడా పెద్ద అనుకూలంగా లేదు ఏ లాభం చేకూర్చినా గురుడు శుక్రుడు వీరిద్దరూ పరిపూర్ణమైన కటాక్షంతో చూడటం వల్ల మాత్రమే వీరు లబ్ధిని పొందగలుగుతారు. పనులన్నీ కొద్దికొద్దిగా వాయిదాపై ఇబ్బంది అనిపిస్తుంది. శని ప్రభావం చేత రహస్య వ్యాధి వీరిని ఇబ్బంది పెడుతుంది. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి సంపత్ తారైంది శుభప్రదమైన ఫలితాన్ని పొందగలరు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు జన్మతార అయ్యింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పునర్వ ఒకటి రెండు మూడు పాదాల వారికి పరమ మిత్రతార అయింది ఫలితాలు చాలా బాగున్నాయి.
పరిహారం : రాహుకేతువులకు పూజలు చేయించండి శనికి తప్పనిసరిగా జపము హోమము కూడా చేయించండి.
కర్కాటక రాశి :
ఈ రాశివారికి కుటుంబ సౌఖ్యము తగ్గింది. కొద్దిపాటి ధనలాభం మాత్రమే ఉంది. వీరికి విషమ పరీక్షా సమయమని చెప్పాలి. మానసికంగా మాత్రమే ధైర్యాన్ని పొందగలుగుతున్నారు. ఎక్కడికి వెళ్లిన ప్రతి ఒక్క పని వాయిదా పడుతూనే వస్తుంది. నానా విధాలుగా కుటుంబ వ్యవహారంలోని పోషణ ఉద్యోగము అన్ని విధాల ఆలోచనలు గొప్పదైనటువంటి ఇబ్బందిని కూడా ఒకానొక సమయంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబంలో పెద్దకి ఇబ్బంది కలిగే అవకాశం కూడా క కనిపిస్తోంది. శని రాహు కేతువుల ప్రభావం వీరిపై ఎక్కువగా వుంది. దైవం అనుగ్రహం కూడా వీరికి కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఈ వారం చాలా చాలా జాగ్రత్త వహించాలి. ఏ విషయమూ ఏ పని సంపూర్ణం కాదు. పునర్వసు నాలుగో పాదం వారికి పరమ మిత్రతారయింది ఫలితాలు చాలా బాగున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు మిత్రతార అయింది చాలా పనులు నెరవేరుతాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు నైధనతారయింది కాబట్టి చాలా వ్యతి వ్యతిరేకమైన ఫలితాలు అనారోగ్య సూచనలు ఉన్నాయి.
పరిహారం : శనికి జపం చేయించుకోవాలి. రాహు కేతువులు కూడా పూజలు చేయడం మంచిది. గురువు ఉపదేశం చేసిన మంత్రాన్ని అనుష్ఠానం చేయండి.
సింహరాశి :
వీరికి ఈ వారం లాభము ఆనందం సకల సంపదలు విశేష ధన స్థితి ఉన్నాయి. వీటితో ఉక్కిరి బిక్కిరి అవుతారు. రవి ఉన్న స్థితి వ్యయమందు కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి. కుజుడు ద్వారా మీ కుటుంబంలో ఎవరో ఒకరికి శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితి ఉన్నది. గురుడు శుక్రుడు బుధుడు వీరు మీకు నిరంతరము రక్షా కవచాల్లా ఉంటారు. ఎందుకైనా మంచిది కుటుంబ పెద్ద ఆరోగ్యాన్ని గూర్చి జాగ్రత్తలు తీసుకోండి మాతృస్థానం కొద్దిగా ఇబ్బందిగానే ఉందని చెప్పాలి. వారం చివరలో అనగా శుక్ర శనివారాల్లో కుటుంబపరంగా ధనం వ్యయం చాలా ఎక్కువగా జరగనున్నది. మిమ్మల్ని మానసిక ఇబ్బందికి గురి కూడా చేస్తుంది కూడా. ఈ వారం మీరు సుమారుగా తొంభై శాతం శుభ ఫలితాలని పొందగలుగు తున్నారు. మఖ నక్షత్ర జాతకులకు సాధన తారైంది చాలా మంచి ఫలితాలు పొందుతున్నారు. పుబ్బ నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార అయింది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి క్షేమ తారైంది కాబట్టి ఫలితాలు చాలా బాగుంటాయి.
పరిహారం : మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య పూజ గాని సుబ్రమణ్యస్వామి దర్శనం గానీ చేయండి మంగళవారం నియమాన్ని పాటించండి.
కన్యా రాశి :
ఈ రాశివారికి ధనలాభము కుటుంబ సౌఖ్యము సంతోషము ఎక్కువగా పొందుతున్నారు. రవి రాజ్య స్థితిలో ఉన్న ప్రభావం చేత మీరు ఏదో ఒక రకంగా ధనాదయాన్ని పొందగలుగుతారు. కుటుంబంతోనే హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు కార్య విఘ్నాన్ని సూచిస్తున్నాడు అయినా పర్వాలేదు మీకు స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. అకారణ కలహం మాత్రం ఉంది. మీరు కొంచెం ధైర్యం వహించి కార్యాలు చక్కబెట్టుకోవడం చాలా అవసరం. మీరు ఎన్నడూ పొందనంత ఆనందాన్ని ఈవారంలో పొందగలుగుతారు. ఏవైనా వాయిదా పడిన పనులు ఆర్థిక ఉద్యోగ సంబంధ వ్యవహారాలు కూడా చక్కబడతాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు మాత్రమే ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తూ ఉండండి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తారైంది చాలా శుభఫలితాలున్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు విపత్తారయింది ప్రతికూల స్థితి ఉంది. చిత్త ఒకటి రెండు పాదాల వారికి సంపత్తారైంది ఆర్థిక పరపతి చేకూరుతోంది.
పరిహారం : మంగళవారం నియమాల్ని పట్టండి. ఆంజనేస్వామి దర్శనము సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ మంచి ఫలితాలు ఇస్తాయి. గురు మంత్రం నిరంతరం చేస్తూ ఉండండి.
తులా రాశి :
ఈ రాశివారికి కార్య జయము ధన ప్రాప్తి స్థిరాస్తి వ్యవహారములు కొంచెం చక్కబడతాయి కాబట్టి మిక్కిలి ఆనందాన్ని పొందగలుగుతారు. రవి లాభం లో ఉన్నాడు. కార్యాన్ని జయిస్తాడు మరింత ఉత్సాహం మీరు పొందగలుగుతున్నారు. గురు అనుగ్రహం మీపై వ్యతిరిక్తంగా ఉంది కాబట్టి చిన్న కష్టాన్ని మీరు పొందక తప్పదనే అనిపిస్తోంది. శుక్రుడు స్థిరాస్తి వ్యవహారాల్లో మీకు గొప్ప సహకారాన్ని అందిస్తాడు. కాబట్టి ఈ వారంలో మీరు ఏవైనా పనులు అవిన్నీ నెరవేరతాయి. కోర్టు వ్యవహారాల్లో ఈ వారంలో మీరు లాభాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది. మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లు ఈ వారంలో మిమ్మల్ని అభిమానించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఉదర రోగము ఎముకల సంబంధించిన రోగం ఉంది అది కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. శత్రువులు పెరుగుతున్నారు మీ దృష్టి వారిపై కేంద్రీకరించండి. చిత్త ఒకటి రెండు పాదాలు వారికి సంపత్తారైంది శుభఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి స్వాతి నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారికి పరమ మిత్ర తారైంది శుభఫలితాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.
పరిహారం : గురునకు పూజ జపం చేయండి. శనగలు దానం చేస్తే చాలా మంచిది. గురువారం నియమం ఇంకా మంచి ఫలితాలని ఇస్తుంది.
వృశ్చిక రాశి :
ఈ రాశివారికి సౌఖ్యము కొద్దిపాటు ధనలాభము ఆనందాన్ని కలిగిస్తాయి. రవి భాగ్యంలో ఉన్నప్పటికీ మీకు అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. అలాగే మానసిక ఒత్తిడికి చంద్రుడు కారణం అవుతున్నాడు. పంచమంలో ఉన్న కుజుడు శత్రువుల సంఖ్యను పెంచుతున్నాడు. సప్తమంలో ఉన్న శుక్రుని వల్ల మీకు ఏదో ఒక అనారోగ్య సూచన కనిపిస్తుంది.దీన్ని అధిగమించే ప్రయత్నము దైవికంగా వైద్యపరంగా కూడా మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం. బుధుడు మీ కోరికల్ని నెరవేరుస్తాడు అతను అష్టమంలో ఉన్నప్పటికీ మీకు మేలే జరుగుతుంది. గురుడు మీకు స్థానం బలాన్ని లాభాన్ని చేకూర్చి స్థిరత్వాన్ని ఇస్తాడు. చిన్న చిన్న ఆందోళనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. శని మాత్రం తృతీయ ముందుంటూ మీకు ధనలాభాన్ని చేకూరుస్తాడు. ఈ వారంలో ఆకస్మికంగా మీరు ధనాన్ని పొందే అవకాశం ఉంది. విశాఖ నాలుగో పాదం వారికి పరమమిత్రతారయింది అనుకూల పరిస్థితులు ఉన్నాయి .అనూరాధా నక్షత్రజాతకులకు మిత్రతార ఐంది చాలా మంచి ఫలితాలున్నాయి. జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు నైధన తారైంది పూర్తి వ్యతిరిక్త ఫలితాలు కనిపిస్తున్నాయి.
పరిహారం : గురుని ప్రార్థించండి కుజుడికి సుబ్రహ్మణ్య అర్చన లేదా సుబ్రహ్మణ్య పూజ దర్శనము చేయండి నిరంతరమూ శివుడికి అభిషేకించండి శుభ ఫలితాలు పొందగలరు.
ధనూ రాశి :
ఈ రాశివారికి విశేష ధన సంపద సౌఖ్యము కొంచెం ముందుకు నడిపిస్తున్నాయి. వీరు కొద్దిపాటి ఆనందాన్ని అనుభూతిని పొందగలుగుతున్నారు. చంద్రుని ప్రభావం చేత అనారోగ్య సూచన పెద్దల వల్ల లేదా రాజకీయ నాయకుల వల్ల విపత్తు కనిపిస్తోంది. ఇది బాగా ఆలోచించుకోవాల్సిన విషయం. కుజుడు శత్రువును పెంచుతున్నాడు మీకు ఆరో ఇంట్లో ఉన్న శుక్రుడు అపకీర్తిని తెచ్చి పెడుతున్నాడు అని హెచ్చరిక అనిపిస్తుంది. ఏ రకంగా చూసినా రాహు సప్తమంలో ఉండటం వల్ల పరిస్థితి కూడా బాగోలేదు. శతృవృద్ధి పెరుగుతోంది శని కూడా ద్వితీయ మందు ఉండటం వల్ల మీకు అనారోగ్య సూచన ఉంది. యాభై శాతం ఈ వారం మీకు అనుకూలంగా ఉంది జాగ్రత్త వహించడం చాలా అవసరమే అనిపిస్తుంది. మూలా నక్షత్ర జాతకులకు సాధన తారైంది పనులన్నీ చక్కబడతాయి పూర్వాషాడ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారైంది వ్యతి రిక్త ఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి క్షేమ తారైంది ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి
పరిహారం : రాహు కేతులకు పూజలు చేయించండి. శనికి జపం చేయండి. నల్ల నువ్వులు నల్ల వస్త్రము నువ్వుల నూనె దానము ఇవ్వండి మంచి ఫలితాల్ని ఇస్తాయి.
మకర రాశి :
ఈ రాశివారికి ధనలాభము బంధు దర్శనము సుఖ జీవనము ఇవి ఆనందాన్ని సంతృప్తిని ఇస్తున్నాయి. అయితే రవి సప్తమంలో ఉండటం వల్ల గొప్ప విచారాన్ని సూచిస్తున్నాడు . చంద్రుడు మాత్రం వీళ్లకి అనుకూలంగా ఆనందింప చేస్తాడు. కుజుడు తృతీయ మందున్నాడు కాబట్టి సకల భోగాలను అనుభవింపచేసి మేలు చేస్తాడు. బుధుడు సానుకూలంగా ఉన్నాడు వీరికి వ్యతిరిక్తంగా ఉన్నది గురుడు. సమయానికి మీకు విషయం జ్ఞప్తికి రాక లేదా వస్తువుల్ని ఓ డాక్యుమెంట్స్ లాంటివి మర్చిపోవడం అవసరమైనవి ఏవో కోల్పోతుండడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. బంధు దర్శనము మీకు అనుకూలంగా ఉంది వారి ద్వారా మీరు ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. కానీ వారం మధ్యలో చంద్రుడు ప్రభావం చేత అనారోగ్య పరిస్థితి కన్పిస్తుంది. దాన్ని వీరు జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయాలి. జన్మ శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఉత్తరాషాఢ నాలుగో పాదం వారికి క్షేమ తారైంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రవణానక్షత్ర జాతకులకు విపత్తారైంది ప్రతికూల పరిస్థితులు ఎక్కువ కల్పిస్తున్నాయి. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి సంపత్తారైంది సానుకూలంగా పనులన్ని జరుగుతాయి.
పరిహారం : శనికి జపం చేయించడం, సూర్య నమస్కారాలు మంచి ఫలితాన్నిస్తుంది. ప్రార్థన చేయండి గురువారం వార నియమాన్ని పాటించండి.
కుంభ రాశి :
ఈ రాశి వారికి కొద్దిపాటి సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. వీరు ఇబ్బందిపడే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పంచమములో ఉన్న రవి శత్రు నాశనం చేస్తే వీరు హాయిని ఆనందాన్ని పొందగలుగుతారు. చంద్రుడు కార్యాహాని కలిగిస్తున్నాడు. వారం మధ్యలో ఆర్థిక పరిపుష్టిని ఇస్తాడు. బుధ, గురులు ఇద్దరు కూడా వ్యతిరేకంగానే పనిచేయటం వీరిలో ఆత్మస్థైర్యము మనోధైర్యం కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి గురుడు శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత స్త్రీ ద్వారా సఖ్యతను పొందగలుగుతున్నారు. రాహుకేతువులు ధనం వ్యయం శతృవృద్ధి సూచిస్తున్నారు. కాబట్టి ఇది వీరికి ఒక పరీక్షా కాలంగానే చెప్పుకోవాలి. కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరము. ధనిష్ట మూడు నాలుగు పాదాలు వారికి సంపత్ తారైంది చాలా బావుంది. శతభిషం నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ధనవ్యయము ఎక్కువగా సూచిస్తోంది. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి పరమ మిత్రతార అయింది మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి.
పరిహారం : బుధ గురులకు జపం చేయించండి. బుధ గురు వారాల నియమము పాటించండి. బుధవారం నాడు నానబెట్టిన పెసలు బెల్లము గురువారం నాడు శనగలు బెల్లము ఆవుకి తినిపించండి.
మీన రాశి :
ఈ రాశివారికి శుభ ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కాస్త ధన లాభము శత్రువిజయము వీరిని కొంచెం ముందుకి నడిపిస్తుంది. వీరిలో పాపభీతి శత్రుభయం అనేక విషయాలలో విచారము కూడా ఇబ్బందికి గురిచేస్తాయి. ప్రశాంతతను ఇవ్వాల్సిన చంద్రుడు స్థానాలు మారటం వల్ల ఇబ్బంది కలిగిస్తున్నడు. లగ్నంలో ఉన్న కుజుడు వీరికి గొప్ప గొప్ప విచారాన్ని కలిగిస్తాడు. బుధుడు మాత్రము శత్రువులపై పట్టును సాధించి వీరికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాడు. గురుడు అనుకూలం గా లేకపోవడం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అయిపోతోంది. శుక్రులు వీరికి ఆర్థికమైన పరిపుష్టిని కలిగించే ప్రయత్నం చేస్తాడు. రాహు కేతువుల ప్రభావం చేత గౌరవానికి ఇబ్బందిని ద్రవ్య నష్టం కూడా కనిపిస్తుంది మొత్తంమీద ఈ వారంలో వీరు ఎక్కువ శ్రమపడి కష్టాల్ని దాటుతుంటారు. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి పరమ మిత్ర తారైంది అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు నైధనతారైంది ప్రతి కూల పరిస్థితులే చాలా ఎక్కువగా ఉన్నాయి.
పరిహారం : గురుడికి గురువారం నియమం గురుచరిత్ర పారాయణ సుబ్రహ్మణ్య దర్శనము లేదా ఆంజనేయస్వామి పూజ మంచి ఫలితాన్నిస్తాయి. నిరంతరం రుద్రాభిషేకం మంచి పరితమిస్తుంది.బరుద్ర దర్శనం కూడా మంచిది.