కరోనా: రాష్టపతి కీలక నిర్ణయం

By సుభాష్  Published on  14 May 2020 10:44 AM GMT
కరోనా: రాష్టపతి కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఇక కరోనా కట్టడిలో భాగంగా ఆర్థిక సాయంలో చేసేందుకు ఎంతో మంది ముందుకొస్తూ తమ తమ విరాళాలను పీఎం కేర్స్‌ నిధికి సమర్పించుకుంటున్నారు. ఇక తాజాగా దేశ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన వార్షిక వేతనంలో 30శాతం పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

కాగా, రాష్ట్రపతి ఇప్పకే ఒకసారి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అంద‌జేశారు. మార్చి నెలకు సంబంధించిన పూర్తి వేతనాన్ని పీఎం కేర్స్‌ నిధికి జమ చేశారు. తాజాగా వార్షిక వేతనంలో సైతం 30శాతాన్ని విరాళంగా ప్రకటించినట్లు రాష్టపతి భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పాటు ప్రయాణ ఖర్చులు, సంప్రదాయ విందుల ఖర్చులను కూడా బాగా తగ్గించుకున్నారని తెలిపాయి.

ఇక ఇతర కార్యక్రమాలలో కూడా ఆడంబరాలకు పోకుండా కనీస ఏర్పాట్లతోనే సర్దుకోవాలని రాష్ట్రపతి వర్గాలు భావిస్తున్నాయి. ఇక కొద్దిమంది అతిథులతో భౌతిక దూరం పాటిస్తూ, తక్కువ పూల వినియోగం, స్వల్పంగా అలంకరణాలు, ఆహార మెనూలో కూడా కోతలు, తదితర వాటి విషయంలో కూడా పొదుపు చేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి.

Next Story