రష్మిక మందాన బీచ్ వర్కవుట్ వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 30 Sept 2020 3:33 PM IST'ఛలో' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన. అనతి కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. వరుస హిట్లతో దూసుకుపోతుంది రష్మిక. ఈ భామ తెరపై ఎంత సందడి చేస్తుందో సోషల్ మీడియాలో అంతకు పదింతలు చేస్తుంది.
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ అమ్మడు ప్రేక్షకులకు రీచ్ అవ్వబోతుంది. ఫిజిక్ విషయంలో రష్మిక ఎంతగా కష్టపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మిక ఆహార నియమాలు పాటించడంతో పాటు రెగ్యులర్ ఉదయాన్నే బీచ్ లో వర్కౌట్స్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం బీచ్ వీడియోను షేర్ చేసిన రష్మిక తాజాగా మరో బీచ్ వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. తాజా వీడియోలో రష్మిక చేతిలో చాలా బరువైన వెయిట్ ను పట్టుకుని ఇసుకలో నడుస్తూ వెళ్తుంది. ఇంకా ఆమె పలు రకాల వర్కౌట్స్ చేయడంతో పాటు కుక్కతో కూడా సరదాగా కొంత సమయంను గడిపింది.
సోషల్ మీడియాలో రష్మిక షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతోంది. హీరోయిన్స్ సరైన ఫిజిక్ ను కాపాడుకోవాలంటే.. ఈ మాత్రం కష్టపడాల్సిందేనంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వెలువడుతున్నాయి. ప్రస్తుతం రష్మిక.. కర్ణాటకలో ఓ షూటింగ్ లో ఉంది. త్వరలోనే పుష్ప షూటింగ్ లో పాల్గొనబోతోంది.