చీరలో రష్మి తళుకులు..ప్లీజ్ వాడుకోండి !

By రాణి
Published on : 28 Jan 2020 4:19 PM IST

చీరలో రష్మి తళుకులు..ప్లీజ్ వాడుకోండి !

వెండితెరైనా..బుల్లితెరైనా అందాల భామలు తమ కెరీర్లో ఎప్పుడో ఒకసారి డల్ ఫేస్ చూడాల్సిందే. హాట్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా ప్రస్తుతం అలాంటి దశలోనే ఉంది. టీవీ షో లలో అవకాశాలు ఉన్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఈ ముదురు బ్యూటీకి చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు. అయితే ఈ అమ్మడు మాత్రం ఇదంతా పట్టించుకోకుండా తన అందాలను చూపిస్తూ...సోషల్ మీడియాలో కుర్రకారును రెచ్చగొట్టే ప్రోగ్రామ్ ను సగర్వంగా చేసుకుంటూ పోతుంది.

ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటానికి తరచుగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ...వాటితో ఇంకా తనలో గ్లామర్ తగ్గలేదు అనిపించుకునే ప్రయత్నాలలో ఉంది. రష్మి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఎప్పటిలాగే హాట్ నెస్ ఎలివేట్ అయ్యేలా చీర కట్టింది. మొత్తానికి ఫోటోలలో రష్మీ తళుకులు ఉండే స్లీవ్ లెస్ బ్లౌజు ధరించి వయ్యారంగా ఫోజులిచ్చింది. కొంచెం కూడా ఎక్కువ కాకుండా చేసుకున్న మేకప్.. ఆకర్షణీయంగా ఉన్న హెయిర్ స్టైల్ తో పాటు సెన్సువల్ ఎక్స్ ప్రెషన్లు ఇస్తూ కుర్రాళ్ళను బాగానే ఆకట్టుకుంది.

Rashmi Gautam Photo Shoot 2 Rashmi Gautam Photo Shoot 3 Rashmi Gautam Photo Shoot 4

నిజానికి రష్మి చూపుల్లో హాట్ నెస్ టన్నుల్లో కొద్ది ఉన్నా.. అనసూయ భారీ అందాల ముందు రష్మి వయ్యారాలు పెద్దగా పనిచెయ్యట్లేదు. అందుకేనేమో టాలీవుడ్ డైరెక్టర్స్ అనసూయ కోసం రాసినట్టు రష్మి కోసం రోల్స్ రాయట్లేదు. ఆ మధ్య చిన్న చితకా సినిమాలతో బాగానే హడావుడి చేసినా రష్మి.. ఈ మధ్య ఆ సినిమాలు కూడా లేకుండా ఖాళీగా ఉంటుంది. ఆ అసహనంతో తనలోని నటిని ఎవ్వరూ వాడుకోవట్లేదని రష్మి ఫీల్ అవుతుందట. కొంతమంది డైరెక్టర్స్ కి నాలోని టాలెంట్ ని కూడా వాడుకోండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తోందట. మరి డైరెక్టర్స్ ఛాన్స్ లు ఇస్తారా.. చూడాలి.

Next Story