పిన్నీసు దూర‌డం కూడా క‌ష్ట‌మే..!

By అంజి  Published on  28 Jan 2020 4:00 AM GMT
పిన్నీసు దూర‌డం కూడా క‌ష్ట‌మే..!

ముందుగా అనుకున్న‌ట్టే రేపు ప్ర‌సారం కానున్న ఢీ షో అద్దిరిపోనుంది. నిర్వాహ‌కులు విడుద‌ల చేసిన ప్రోమో చూస్తే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోపాటు అద్దిరిపోయే డ్యాన్స్ ఫ‌ర్ఫామెన్స్ చేసి అంద‌ర్నీ ఫుల్‌గా అల‌రించారు. ఇక మ‌న ఎన‌ర్జిటిక్ యాంక‌ర్ ప్ర‌దీప్ రీ ఎంట్రీతో ఢీ స్టేజ్‌కు కొత్త క‌ల వ‌చ్చింది. త‌న పంచ్ మార్క్‌ను మరోసారి చూపించి సుధీర్, ఆదికి ఎంట్రీలోనే చుక్క‌లు చూపించాడు.

ప్రోమోలో టీమ్ లీడ‌ర్స్ ఎంట్రీతోనే సుధీర్ క‌డుపుబ్బా న‌వ్వించ‌గా, ఆది త‌న పంచ్‌ల‌తో ఎంట్రీ సాంగ్ హిలేరియ‌స్‌గా ఉంది. టీమ్ లీడ‌ర్స్‌తో ప్ర‌దీప్ చేసిన కామెడీ క‌డుపుబ్బా నవ్విస్తుంది. ఇక‌పోతే జ‌తిన్ లేడీ గెట‌ప్‌లో వేసిన డ్యాన్స్‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే సుడిగాలి సుధీర్ ఒక జోడీ ప‌ర్ఫామెన్స్‌కు అద్దిరిపోయే రియాక్ష‌న్స్ ఇచ్చి అంద‌రూ షాక్ అయ్యేలా చేశాడు.

వెంట‌నే అదే అమ్మాయితో అదే సాంగ్‌లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. సుధీర్ ఆల్రెడీ మంచి డ్యాన్స‌ర్ అని చాలా సార్లు నిరూపించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఢీ స్టేజ్‌పై కంటెస్టెంట్స్‌తో చేసిన హాట్ డ్యాన్స్‌కు ర‌ష్మీ కూడా షాక్ అయిపోయింది. ఆ త‌రువాత వ‌చ్చిన మ‌న లేడీ టీమ్ లీడ‌ర్‌తో ప్ర‌దీప్ ఒక ఆటాడుకున్నాడు.

ప్ర‌దీప్ ఢీ షోలో త‌న రీ ఎంట్రీ ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా ఇచ్చాడ‌నే చెప్పాలి. వ‌చ్చీ రాగానే అంద‌రిపై పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డాడు. వ‌ర్షిణి అయితే ప్ర‌దీప్ వేసే పంచ్‌ల‌కు న‌ల్ల‌ముఖం పెట్టాల్సి వ‌చ్చింది. వాట‌న్నింటిక‌న్నా సుధీర్ డ్యాన్స్ రేపు ప్ర‌సారం కానున్న ఢీ షోలో మెయిన్ హైలెట్ కాబోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ప్రోమో లాస్ట్‌లో ఒక ఎమోష‌న్ డ్యాన్స్‌తో ఈ ప్రోమో ముగిసింది.

ఢీ స్టేజ్‌పై క‌పుల్ చేసిన హాట్ ప‌ర్ఫామెన్స్ మ‌ధ్య‌లో సుధీర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ వారు ఏ రేంజ్‌లో ఫీల‌వుతున్నారో ఇట్టే తెలిసిపోతుంది. అంత‌లా ఈ ఇద్ద‌రు టీమ్ లీడ‌ర్స్ ఇన్వాల్వ్ అయిపోయారు. ఎప్ప‌టిలానే ఈ సారి కూడా సుధీర్ త‌న మ‌ల్టీటాలెంట్‌ను చూపించ‌బోతున్నాడు. ఇక‌పోతే లాస్ట్ వీక్‌లో ఆపేసిన ఎలిమినేష‌న్‌ను రేపు ప్ర‌సారం కానున్న షో నుంచి కంటిన్యూ చేయ‌నున్నారు. గ‌త వారం చంటీ వ‌ల్ల సుధీర్ టీమ్ ఎలిమినేష‌న్స్ నుంచి త‌ప్పించుకుంది. ఈసారి ఎటువంటి రిక్వెస్ట్‌లు లేకుండా ఎలిమినేష‌న్ క‌న్ఫామ్‌గా ఉంటుంద‌ని జ‌డ్జెస్ తేల్చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమో ప్ర‌స్తుతం మూడు మిలియ‌న్ల వ్యూస్‌ను సాధించింది.

Next Story
Share it